అడ్డంగా ‘బుక్‌’ చేసేశారు.. క్షణాల వ్యవధిలో..

Cyber Crime: Man Cheated Money In Engineering Student Srikakulam - Sakshi

కోటబొమ్మళి(శ్రీకాకుళం): ఆన్‌లైన్‌లో పుస్తకం బుక్‌ చేసి డబ్బులు చెల్లించిన తర్వాత నిమిషాల వ్యవధిలో అకౌంట్లోని డబ్బులు మాయం కావడంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కోటబొమ్మాళి ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేటకు చెందిన ఆరవెల్లి ప్రదీప్‌ ఆగస్టు 7న ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి ఇంజినీరింగ్‌కు సంబంధించిన మైక్రో కంట్రోలర్‌ కోర్సు పుస్తకాన్ని బుక్‌ చేశాడు. అనంతరం 30 నిమిషాల వ్యవధిలో దఫదఫాలుగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,04,320 సైబర్‌ నేరగాళ్లు దోచేశారు.

నగదు డెబిట్‌ అయిన విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో బాధితుడు సైబర్‌ క్రైం(విజయవాడ) పోలీసులకు 1930 నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే స్పందించి బ్యాంకు ఖాతాను బ్లాక్‌ చేయించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పంపాలని కోట»ొమ్మాళి పోలీసులకు గురువారం సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరుగుతుందని, ఆన్‌లైన్‌లో వస్తువులు బుక్‌ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..
 
 
    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top