పోలీసులకే టోకరా.. వాష్‌రూమ్‌ వెళ్తానని చెప్పి.. | Culprit Escaped From Police In The Name Of Washroom In Vikarabad | Sakshi
Sakshi News home page

పోలీసులకే టోకరా.. వాష్‌రూమ్‌ వెళ్తానని చెప్పి..

Oct 29 2021 11:34 AM | Updated on Oct 29 2021 12:02 PM

Culprit Escaped From Police In The Name Of Washroom In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ వాష్‌రూమ్‌కు వెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో వారు.. అతడిని వదిలిపెట్టారు.

ఎంత సమయం గడిచిన నిందితుడు రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెళ్లి చూశారు. అక్కడ నిందితుడు లేడు. దీంతో షాకైన పోలీసులు..  తప్పించుకున్న నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. 

చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్‌ తాగిన యువకుడు..

Advertisement
 
Advertisement
Advertisement