
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ (38) సోమవారం తెల్లవారుజామున కత్తితో గొంతు కోసుకున్నాడు. కడప సాయిపేటకు చెందిన ఇతను మూడు రోజుల నుంచి రిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కత్తితో గొంతు కోసుకోవడంతో గమనించిన వైద్యులు సర్జికల్ ఐసీయూలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా రిమ్స్ వైద్యులు మాట్లాడుతూ ఇతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలి పారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రిమ్స్ పోలీసులు చెప్పారు.