వివాహిత అదృశ్యం.. భర్త ఇంట్లోలేని సమయంలో..

Conflict Between Wife And Husband: Woman Missing In Anantapur District - Sakshi

పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): మండల కేంద్రంలోని రామకోటి కాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే వివాహిత అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం  ఫిర్యాదుచేశారు. వివరాలు.. తాడిపత్రి మండలం అక్కన్నపల్లికి చెందిన తలారి నాగలక్ష్మమ్మ బాలసుంకన్న కుమార్తె లక్ష్మీనారాయణమ్మను ఏడాది క్రితం ఆటో నడుపుతూ జీవనం సాగించే పెద్దపప్పూరుకు చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు.

చదవండి: ‘నేను చనిపోతా.. నన్ను బలవంతంగా పంపుతున్నారు’

ద్విచక్ర వాహనం కొనుగోలు విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. సోమవారం భర్త ఇంట్లోలేని సమయంలో లక్ష్మీనారాయణమ్మ ఇంటినుంచి వెళ్లి పోయింది. తమ కూతురు ఆచూకీ కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బీటీ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top