Newly Married Bride Commits Suicide In Kurnool District, Details Inside - Sakshi
Sakshi News home page

Kurnool Crime: ‘నేను చనిపోతా.. నన్ను బలవంతంగా పంపుతున్నారు’

Apr 5 2022 6:58 PM | Updated on Apr 5 2022 9:16 PM

Newlywed Bride Commits Suicide In Kurnool District - Sakshi

మండలంలోని కె.తిమ్మాపురం గ్రామంలో సోమవారం రాత్రి బావిలో పడి నవ వధువు చాకలి రేణుక(19) ఆత్మహత్య చేసుకుంది.

ఎమ్మిగనూరు రూరల్‌(కర్నూలు జిల్లా): మండలంలోని కె.తిమ్మాపురం గ్రామంలో సోమవారం రాత్రి బావిలో పడి నవ వధువు చాకలి రేణుక(19) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాసులు కుమారుడు చాకలి వీరేష్‌కు వెల్దుర్తికి చెందిన వెంకటేష్‌ కుమార్తె రేణుకతో 2022 ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి దిగాలుగా ఉండేదని తెలుస్తోంది. ఉగాది పండుగకు పుట్టింటికి వెళ్లి సోమవారం ఉదయం భర్త ఇంటికి వచ్చింది.  పుట్టింటి నుంచి తల్లిదండ్రులతో కాకుండా ఒక్కటే బస్సుకు వచ్చింది. తన తండ్రికి కూడా నేను చనిపోతాను, నన్ను బలవంతంగా పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: Viral‌ Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో..

అయితే భర్త ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను మా ఊరికి వెళ్తానని చెబుతుండటంతో రేపు వెళ్దువులే అని వారు సర్ది చెప్పారు. రాత్రి అందరూ ఇంట్లో ఉండగా ఆమె ఉన్నట్లుండి బయటకు వెళ్లటంతో అనుమానం వచ్చి భర్త, కుటుంబ సభ్యులు కూడా అనుసరించారు. వాళ్లను తప్పించుకొని టీఎస్‌ కూళ్లూరు రోడ్డులో ఉండే బావిలో దూకింది. అటుగా వచ్చిన వీరేష్‌ కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ఇప్పుడే మీ కోడలు ఇటుగా వెళ్లిందని చెప్పటంతో అనుమానం వచ్చి బావి దగ్గరకు వెళ్లారు. బావిలో చాలా సేపు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం రూరల్‌ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంపై రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ను సంప్రదించగా మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారు వస్తే విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.     

Advertisement
 
Advertisement
Advertisement