Hyderabad: Child Died After Falling Into Pothole On Bachupally Road - Sakshi
Sakshi News home page

బాచుపల్లిలో విషాదం: రోడ్డుపై గుంతకు బలైన చిన్నారి

Aug 2 2023 11:08 AM | Updated on Aug 2 2023 3:45 PM

Child Died After Falling Into Pothole On Road Bachupally Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్‌ బస్సు  వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది.

చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో  రెడ్డీస్ ల్యాబ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను బస్సు డ్రైవర్‌ ఢీకొట్టాడు. బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఎనిమిదేళ్ల దీక్షిత బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందింది. డ్రైవర్‌ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో  దీక్షిత 2వ తరగతి చదువుతోంది.


చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లి, నీటి కొళాయిని తాకగానే..

Advertisement
 
Advertisement
Advertisement