చంఢీగడ్: మెడికల్ షాప్‌లోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటన చంఢీగఢ్‌లో చోటు చేసుకుంది. మెడికల్‌స్టోర్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఒక్కసారిగా మెడికల్ షాప్‌లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్యాషియర్ మృత్యువాత పడ్డారు. మెడికల్ షాపులో చొరబడి కాల్పులు జరపడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెడికల్ షాపులోకి చొరబడి కాల్పులు జరపడం వెనుక పాత విభేదాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పాత గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


