Chandigarh : బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు | explosion at the Chandigarh BJP Office | Sakshi
Sakshi News home page

Chandigarh : బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

Apr 1 2026 6:13 PM | Updated on Apr 1 2026 7:11 PM

explosion at the Chandigarh BJP Office

పంజాబ్‌: ఛండీఘడ్‌ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పార్క్‌ చేసిన ఉంచిన స్కూటీలో పేలుడు సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. 

పోలీసుల వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం చండీగఢ్ సెక్టార్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడు కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే, పేలుడుకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు.

ఈ పేలుడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక విచారణలో  ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి నాటు బాంబు లేదంటే ఐఈడీ విసిరి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement