భూమా అఖిలప్రియ భర్త‌, సోదరుడిపై మరో కేసు

Case Against Bhuma Akhila Priya Husband Bhargav Ram And Brother Vikhyat Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌, సోదరుడు విఖ్యాత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు కేసు నమోదైంది. నకిలీ కోవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించి ఈనెల 3న కోర్టులో జరగాల్సిన విచారణకు హాజరుకాలేమని జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్‌ రామ్‌ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదం కిడ్నాప్‌ కేసులో భార్గవ్‌రామ్‌, విఖ్యాత్‌రెడ్డి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top