దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్‌స్పెక్టర్‌... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..

BSF Police Lodge Complaint Help Of CM Helpline 9 Years Not Filled  - Sakshi

సాధారణ వ్యక్తుల పెద్ద మొత్తంలో మోసపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక వేళ్ల ఎవరైన కాస్త అధికారుల అండదండ ఉన్నాళ్లు అయితే కేసు ముందుకు వెళ్తుంది లేదంటే అంతే పరిస్థితి. సాక్షాత్తు బోర్డర్‌లో పనిచేసే ఒక ఇన్‌స్పెక్టర్‌ భారీ మొత్తంలో మోసానికి గురయ్యాడు. పాపం ఆయనే ఫిర్యాదు చేసేందుకు తొమ్మిదేళ్లుగా పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. 

వివరాల్లోకెళ్తే....బోర్డర్‌సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ కుమార్‌ గుప్తాని గురుగ్రామ్‌కి చెందిన ఒక ఐటీ సంస్థ దాదాపు రూ. 5.5 లక్షల మేర మోసం చేసినట్లు పోలీస్‌ అధికారి సంజయ్‌ శుక్లా తెలిపారు. సదరు ఇన్‌స్పెక్టర్‌ ఇండోర్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఆయనకి  అక్టోబర్‌7, 2014న గురుగ్రామ్‌లో ఐటీపార్కు నుంచి కాల్‌ వచ్చిందని,  ఆ కంపెనీ ఆయనకు కోట్లలో డబ్బు వస్తుందని ఆశ చూపి సుమారు రూ. 5 లక్షల మేర దోచుకున్నట్లు వెల్లడించారు.

దీంతో గుప్తా పలుమార్లు సెబీకి ఫిర్యాదు చేసినట్లు శుక్లా తెలిపారు. రెండేళ్లకు పైగా సెబీతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపగా... గుప్తా పేర్కొన్న పేరుతో ఏ కంపెనీ రిజస్టర్‌ కాలేదని తెలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత గుప్తా పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేద్దామనకుంటూ అసలు కుదరలేదని, తొమ్మిదేళ్లు పైగా కేసు నమోదు కాలేదని చెప్పారు. చివరికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ సాయంతో ఫిర్యాదు చేయగలిగినట్లు శుక్లా వెల్లడించారు. అయితే ఈ కేసు ఆయనకు కంపెనీకి మధ్య జరిగిన ఫోన్‌, సోషల్‌ మీడియా చాట్‌ల సాయంతో దర్యాప్తు చేయనున్నట్లు సంజయ్‌ శుక్లా పేర్కొన్నారు.

(చదవండి: విడాకులు తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ)

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top