మరదలిపై ఇష్టం, పెళ్లి కాకపోవడంతో రచ్చ.. చేసేదేం లేక

Brides Relative Attack On Groom Father Then Marriage In Police Station In UP - Sakshi

వధువు బంధువుల దాడి: పోలీసు స్టేషన్‌లో పెళ్లి

లక్నో: సాధారణంగా వధువరులు తమ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఓ పెద్ద ఫంక్షన్‌ హాల్‌ లేదా ప్రసిద్ది చెందిన దేవాలయంలో అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృభిస్తున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో పరిమిత సంఖ్యలో బంధువులు పాల్గొనాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు విధించిన సంగతి విధితమే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్‌లోని ఓ వివాహ వేడుకకు పోలీసు స్టేషన్‌ వేదికైంది.

వివరాల్లోకి వెళ్తే..  మరి కొద్ది నిమిషాల్లో వధువరులు వివాహం చేసుకొని ఒకటి కాబోతున్న వేళ పెద్ద గొడవ జరిగింది. వధువు క్రాంతి వర్మకు సంబంధించిన కొంత మంది బంధువులు వరుడు కమలేశ్‌ వర్మ బంధువులు, అతిథులపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా వధువు బావ వరుసయ్యే ఓ వ్యక్తి కమలేశ్‌ తండ్రి రామకృష్ణను కిందకు తోసేసి దాడి చేశాడు. కమలేశ్‌ సోదరుడు, బంధువులు ఎంత ఆపినా వారు వినకుండా మధ్యలో వచ్చినా వారిని తోసేస్తూ నానా హంగామా చేశారు. దీంతో ఏం చేయలేక వధువరుల కుటుంబ సభ్యులు అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. 

దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తూ.. పోలీసు స్టేషన్‌లోనే సంప్రదాయబద్దంగా కమలేశ్‌వర్మ, కాంత్రివర్మ వివాహం జరిపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. వధువు బంధువులు వివాహ వేడుకలో గొడవ చేశారని తెలిపారు. దీంతో తమ సమక్షంలో పోలీసు స్టేషన్‌లో వివాహం చేశామని వివరించారు. రాత్రి 2.30గంటకు వివాహం పూర్తి అయిందని, పోలీసుల భద్రత కల్పిస్తూ.. ఉదయం 6.30 గంటలకు వారిని ఇంటి పంపించినట్లు తెలిపారు. గొడవకు పాల్పడిన వధువు బంధువులు, బావపై కేసు నమోదు చేసుకొని దర్పాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

వరుడు కమలేశ్‌ సోదరుడు మాట్లాడుతూ.. వివాహ వేడుకలో గొడవ జరుగుతుందని అసలు ఊహించలేదన్నారు. పెళ్లి కూతురు క్రాంతి​ వర్మ తండ్రి చాలా మంచివారని, మద్యం కూడా సేవించరని అన్నాడు. అయితే క్రాంతికి బావ వరసయ్యే వ్యక్తి.. క్రాంతిని పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అది జరగకపోవడంతో ఇలా దాడికి తెగపడ్డాడని తెలిపాడు. అయితే పోలీసుల సాయంతో తన తమ్ముడి విహహం జరిగిందని అన్నాడు.
చదవండి: సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం, చీరతో గొంతు బిగించి
  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top