Two Bank Staff Arrested For Stealing Jewels: బ్యాంకులు సురక్షితం అని ప్రజలు అనుకుంటారు. పైగా రుణాలు అవసరమైన ఏ విధమైన రిస్క్ ఉండదని బ్యాంకులనే విశ్వసించి ఆభరణాలు లేదా పొలాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. అటువంటిది ప్రజలు బాగా విశ్వసించే బ్యాంకు ఉద్యోగులే ప్రజలు తాకట్టు పెట్టిన ఆ భరణాలను దొంగలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చం అలాంటి సంఘటనే పాండిచ్చేరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది.
(చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!)
అసలు విషయంలోకెళ్లితే.... పోలీసుల కథనం ప్రకారం..ఒక ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించుకునేందుకు లాస్‌పేట్‌లోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే అతను తాకట్టు పెట్టిన ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరింగ్‌తో ఉన్న నగలు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురుయ్యాడు. దీంతో ఆ ఖాతాదారుడు సదరు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఖాతాదారులు బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన ఆభరణాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు.
అయితే దాదాపు నాలుగు వందల సవార్ల బంగారు ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరిగింగ్ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో రూ. 1.19 కోట్ల విలువైన అసలు ఆభరణాలు తిరిగి లభించాయి. అంతేకాదు ఆ బ్యాంకులో పనిచేస్తున్న గణేశన్ (క్యాషియర్), విజయకుమార్ (అసిస్టెంట్ క్యాషియర్)లు ఇద్దరు ఖాతాదారుల ఒరిజినల్ ఆభరణాలను ప్రైవేట్ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
