పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి.. ఇవ్వనుపో! | Banjara Hills: Complaint File On A Man Who Takes Car For 4 days, Not Give Return | Sakshi
Sakshi News home page

కారు ఇవ్వురా.. ఇవ్వనుపో ఏం చేసుకుంటావో చేసుకో..

Apr 5 2021 7:52 AM | Updated on Apr 5 2021 9:27 AM

Banjara Hills: Complaint File On A Man Who Takes Car For 4 days, Not Give Return - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లి చూపుల కోసం నాలుగు రోజులు కారు వాడుకుంటానని తీసుకెళ్లి మళ్లీ కారు ఇవ్వమని అడిగితే ఇవ్వనుపో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కమలాపురి కాలనీ ఫేజ్‌–2లో నివసించే కాట్రగడ్డ సుధాకర్‌ గత అక్టోబర్‌ నెలలో విజయవాడ పెనమలూరుకు చెందిన తన స్నేహితుడు మండలపు ప్రసన్నకుమార్‌కు తన క్రెటా కారును ఇచ్చాడు. తిరిగి ఎన్నిసార్లు కారు ఇవ్వమని అడిగినా వివిధ కారణాలు చూపుతూ తప్పించుకోసాగాడు.

ఇటీవల గట్టిగా అడిగితే ఇవ్వనుపో ఈ కారు నాది తిరిగి నీ మీదే కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని, గతంలో కూడా తన ఇంట్లో బంగారం అదృశ్యమైన ఘటనలోనూ ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తన కారు రిజిస్ట్రేషన్‌ తన పేరు మీదే ఉందని అక్రమంగా కారును వాడుకుంటున్న ప్రసన్నకుమార్‌పై చీటింగ్‌తో పాటు దొంగతనం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: డ్రక్స్‌ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీవారే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement