
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం ఎసీపీ జయరాం సస్పెన్షన్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. బాధితులతో కలసి స్పెషల్ టీం సభ్యులు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 81నుంచి 200 మద్య లోని 400 ఎకరాలను అధికారులు పరిశీలించారు. సానా సతీష్ ఆదీనంలోని ఈ 147ఎకారాల్లోని వేలకోట్ల విలువైన భూమి వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ భూమిపై కలకత్తా ఫైనాన్స్ కంపెనీ నుంచి సానా సతీష్ భారీగా రుణం తీసుకోగా.. కలకత్తా కంపెనీ హైపొతికేషన్ పేరుతో భూముల్లో బోర్డ్‌లు పాతారు. (కీసర ఇంచార్జ్ తహశీల్దార్‌గా గౌతమ్ కుమార్)
అయితే టెనెంట్స్‌కు , యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు అవ్వడంతో ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుటుంబం అని రుజువైంది. సానసతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులు ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే కేసులో గతంలో ఏమ్మార్వో ,వీఆర్వో సస్పెన్షన్.. విజయారెడ్డి అనే ఎమ్మార్వో దారుణ హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌తో పాటు తాజాగా సానాసతీష్ అనుచరులకు జయరాం సహకరిస్తున్నాడన్న ఆరోపణలతో ఏసీపీపై బాధితులు అధికారులకు పిర్యాదు చేశారు. (బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు)