ఓవర్‌ హెడ్‌ బిన్‌లో బంగారం దాచి..

Air India Crew And Canteen Staff Arrested Over Gold Smuggling - Sakshi

న్యూఢిల్లీ : 70 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ ఓ ఎయిర్‌ ఇండియా సిబ్బంది, క్యాటరింగ్‌ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఎయిర్‌ ఇండియా సిబ్బంది ఒకరు విమానంలో 70 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని లండన్‌ నుంచి ఇండియాకు తెచ్చాడు. కస్టమ్స్‌ అధికారులనుంచి తప్పించుకోవటానికి బంగారాన్ని ఓవర్‌ హెడ్‌ బిన్‌( వస్తువులు భద్రపరిచే సీట్లపై భాగం)లో దాచేశాడు. ( ప్రసాదంపాడులో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు )

అనంతరం దాచిన బంగారం గురించి స్మగ్లింగ్‌లో భాగస్తుడైన క్యాటరింగ్‌ సిబ్బంది ఒకరితో చర్చించాడు. వీరి మాటలను విన్న అధికారులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్దనుంచి 1.667 కేజీల దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన 1.5 కేజీల బంగారం స్మగ్లింగ్‌లోనూ తమ పాత్ర ఉన్నట్లు నిందితులు తెలిపారు. 

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top