బాగా చదువుకోవాలని చెప్పినందుకు..

13 Years Young Boy Jumped From 14th Floor Of High Rise Apartment In Hyderabd - Sakshi

14వ అంతస్తు పైనుంచి దూకి బాలుడి ఆత్మహత్య

చందానగర్‌: చదువుపై శ్రద్ధ పెట్టాలని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ బాలుడు 14వ అంతస్తు పైనుంచి దూకి మృతి చెందాడు. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనపై ఎస్‌ఐ అహ్మద్‌ పాషా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగండ్లలోని ఓ అపార్ట్‌మెంట్‌ టవర్స్‌లో సీ–14 బి3లో నివాసం ఉంటున్న అమిత్‌ కిమోతీ తన కుమారుడు అద్వైత్‌ కిమోతీ(13)ని బాగా చదువుకోవాలని హెచ్చరించాడు.

దీంతో అకస్మాత్తుగా పరుగుపెట్టిన అద్వైత్‌ 14వ అంతస్తు పై నుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో దగ్గరలోని సిటిజన్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఉదయం 9.30 గంటలకు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top