నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్ట్‌ | 10 People Arrested In Case Of Assault On Girl In Neredmet | Sakshi
Sakshi News home page

నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్ట్‌

Jun 30 2024 9:09 PM | Updated on Jun 30 2024 9:13 PM

10 People Arrested In Case Of Assault On Girl In Neredmet

సాక్షి, హైదరాబాద్: నేరేడ్‌మెట్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement