Lalitha Jewellery: ఎంతో ఆప్యాయంగా పలకరించారు.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసలు

Minister Roja Inaugaurated Lalitha Jewellery Show room In Chittoor - Sakshi

ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. 

కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు.  చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top