నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల విభజనకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల విభజనకు వేళాయె!

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

సీనియారిటీ జాబితాలు ప్రచురణ జోనల్‌ కేడర్‌ ఉద్యోగులుడిసెంబర్‌ 3 లోపు ఆప్షన్స్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేటాయింపులకు కలెక్టర్‌ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ జోనల్‌, జిల్లా స్థాయి కేడర్ల వారిగా విభజన ప్రక్రియ షురూ ఉద్యోగులకు ఆప్షన్స్‌ అవకాశం కసరత్తులో నిమగ్నమైన జిల్లా విద్యాశాఖ అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాల పునర్‌ విభజన ఉద్యోగుల ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ (బోధనేతర) ఉద్యోగుల విభజన ప్రక్రియకు అధికారులు వేగంగా కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు వివిధ కేడర్లకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాలను విద్యాశాఖ ఈ నెల 28న ప్రచురించింది. ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సీనియారిటీ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు జోన్‌, ఉమ్మడి జిల్లా స్థాయిలో అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.

జోన్‌ పరిధిలో విభజన..

డిసెంబర్‌ 5 తుది గడువు

జోనల్‌ కేడర్‌ పరిధిలోకి వచ్చే సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఆడిటర్లు, పాఠ్యపుస్తకాల గోడౌన్‌ మేనేజర్ల విభజనను జోన్‌–4 (ఉమ్మడి చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పరిధిలో చేపట్టనున్నారు. జోనల్‌ పరిధిలో మొత్తం 41 మంది సూపరింటెండెంట్లు, 112 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, నలుగురు పాఠ్యపుస్తకాల గోడౌన్‌ మేనేజర్లు, నలుగురు ఆడిటర్లు ఉన్నారు. వీరంతా తమకు ఆసక్తి ఉన్న జిల్లాలకు సంబంధించిన ఆప్షన్లను డిసెంబర్‌ 5వ తేదీలోపు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కార్యాలయానికి తమ వ్యక్తిగత ఈమెయిల్స్‌తో పంపాల్సి ఉంటుంది. ప్రతి ఉద్యోగీ విధిగా ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని, గడువు దాటితే నిబంధనల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఉమ్మడి జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో కేటాయింపులు

ఉమ్మడి జిల్లా కేడర్‌ ఉద్యోగులైన జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు (అటెండర్లు), నైట్‌ వాచ్‌మెన్లు, స్వీపర్ల విభజనను ఉమ్మడి చిత్తూరు (చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధి) స్థాయిలో చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 45 మంది జూనియర్‌ అసిస్టెంట్లతో పాటు మిగిలిన నాలుగవ తరగతి ఉద్యోగులు, రికార్డ్‌ అసిస్టెంట్లు తమ ఆప్షన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌, ఉత్తర్వులను కమిటీ త్వరలోనే విడుదల చేయనుంది.

అటెండర్లు 60 మంది

జూనియర్‌ అసిస్టెంట్లు 45 మంది

రికార్డ్‌ అసిస్టెంట్లు 42 మంది

వాచ్‌మెన్లు 13 మంది

టైపిస్టులు 10 మంది

స్వీపర్లు 9 మంది

నైట్‌ వాచ్‌మెన్‌, స్వీపర్లు ఐదుగురు

డ్రైవర్లు ఇద్దరు

గార్డెనర్‌, లాబొరేటరీ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌, స్కావెంజర్‌, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌,

వాటర్‌ ఉమెన్లు ఏడుగురు

చిత్తూరు డీఈవో కార్యాలయం

సీనియారిటీ ప్రాతిపదికనే పోస్టింగులు

పకడ్బందీగా ప్రక్రియ

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కసరత్తు చేపడుతున్నాం. నాన్‌టీచింగ్‌ ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే కార్యాలయంలో సంప్రదించవచ్చు.

– లక్ష్మీనారాయణ, డీఈవో, చిత్తూరు

అన్ని కేడర్ల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించిన అనంతరం, అభ్యంతరాలను పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వ విభజన నిబంధనలు, రోస్టర్‌, సీనియారిటీ ఆధారంగా ఆయా జిల్లాలకు పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను జోన్‌ స్థాయిలో వైఎస్‌ఆర్‌ కడప ఆర్జేడీ శామ్యూల్‌, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో డీఈవో లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతూ విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో నాన్‌టీచింగ్‌ ఉద్యోగులు సంబంధిత జిల్లాలకు కేటాయింపు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement