ఫలితాలు ఊహించే ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు ఊహించే ఇలా..

Nov 29 2026 1:22 PM | Updated on Nov 29 2026 1:22 PM

జిల్లాలో మునిసిపల్‌–జెడ్పీ ఎన్నికల్లో ప్రతిపక్షంపై చేసిన దాడులు, పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడని వైనం అధికార పార్టీ నేతల చేష్టలు పాతాళంలోకి పడేస్తోంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఊహించి రిగ్గింగ్‌ చేయడం, దొంగ ఓట్లు వేయడం, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లు చించేయడం, బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారు. అయినా సరే ఓటర్లు తమ తీర్పు ద్వారా చంద్రబాబు నాయుడు సొంత నియోజవకర్గంలోనే వైఎస్సార్‌ సీపీ జెండాను రెపరెపలాడించారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కుట్రలు–కుతంత్రాలు, దాడులకు పాల్పడినా పలమనేరులో 23, కుప్పంలో 19 పంచాయతీలను వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంది. వైఎస్సార్‌ సీపీ ఊసే ప్రజల్లో ఉండకూడదని పచ్చ నేతలు వేసిన ఇనుప కంచె ఆంక్షల మధ్య 23 శాతం సీట్లను గెలుచుకోవడం చిన్న విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement