– 8లో
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనం టిక్కెట్లు లేని వారికి స్వామి వారి దర్శనం 20 గంటలు పడుతోంది.
సజావుగా నిర్వహిస్తారా..?
తొలి దశ పంచాయతీ పోరులో చోటు చేసుకున్న పరిణామాల మధ్య, ఆదివారం జరగనున్న రెండో దశ ఎన్నికల్లో అధికారుల పనితీరు, పోలీసుల నిష్పక్షపాతం కీలకంగా మారనుంది. దాడులు, హత్యాకాండల మధ్య నేర్చుకున్న పాఠాలు.. రెండో దశలో హింసను నివారించడంపై అమలుచేయాలి. ప్రధానంగా పులిచెర్ల, రొంపిచెర్లతో పాటు బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె, పూతలపట్టు, నిండ్ర లాంటి సున్నితమైన మండలాల్లో ఓటింగ్ సరళి, ఫలితాలపైనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నిత్యం గొడవలు, సమస్యలతో ఉండే ఇక్కడి పంచాయతీల్లో అధికారుల ఎన్నికలను సజావుగా నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానంలేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరన్నట్టుగా.. ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల గొంతుకగా ఉన్న ప్రతిపక్షాన్ని మట్టుబెట్టలేరన్నది వాస్తవం.


