విభజనకు నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

విభజనకు నిరీక్షణ

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

● వింత నిబంధనలతో గందరగోళం ● మొత్తం ప్రక్రియపై స్పష్టత కరువు ● ఉద్యోగోన్నతులకు ఫ్రీజింగ్‌ ఎత్తివేత ● టీచర్లకు తప్పని ఎదురుచూపులు

జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపులో జాప్యం

చిత్తూరు.. తిరుపతి.. అన్నమయ్య జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. మొత్తం ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో టీచర్ల పరిస్థితి గందగోళంగా మారింది. అదిగో.. ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అసలు విభజన ఉంటుందా.. ఉండదా.. చేస్తే ఎప్పుడు.. ఎలాంటి కొలమానం తీసుకుంటారు.. సీనియారిటీనా.. వయసును పరిగణనలోకి తీసుకుంటారా తెలియని అయోమయం ఏర్పడింది. దీనిపై సర్కారు నిర్దిష్ట ప్రకటన విడుదల చేయకపోవడంతో అధికార యంత్రాంగం సైతం ఏమీ చేయలేని దుస్థితి దాపురించింది.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పడ్డాయి. పునర్విభజన సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీచర్లను మూడు జిల్లాలకు సర్ధుబాటు చేశారు. చిత్తూరు జిల్లాకు 80.23 శాతం, తిరుపతి జిల్లాకు 9.81 శాతం, అన్నమయ్య జిల్లాకు 8.96 శాతం కేటాయించారు. సర్వీస్‌ రూల్స్‌ మాత్రం చిత్తూరు జిల్లా విద్యాశాఖ పరిధిలోనే అమలవుతున్నాయి. అయితే పునర్విభజన అనంతరం జిల్లా లోని కుప్పం, చిత్తూరు, పలమనేరు, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 902 టీచర్ల పోస్టులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్‌ స్థాయిల్లో ఖాళీలుగా ఉన్నాయి.

వాదనలు విభిన్నం

టీచర్ల విభజన విషయంలో వాదనలు విభిన్నంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వుల ప్రకారం సబ్జెక్టుల వారీగా కేడర్‌ మేరకు సీనియారిటీ జాబితాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఉమ్మ డి చిత్తూరు జిల్లాలో 16 వేల మంది టీచర్లు ఉన్నా రు. వీరిని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల దామాషా ప్రకారం విభజించనున్నారు. విభజన ఆలస్యం కావడంతో నెలవారీగా ఉద్యోగ విరమణ పొందిన టీచర్లను ఈ కేడర్‌ సీనియారిటీ జాబితా నుంచి తొలగిస్తూ వస్తున్నారు. అంగీకారం తీసుకు ని సీనియారిటీ మేరకు టీచర్లను కోరుకున్న జిల్లాల కు అవకాశం కల్పిస్తారని మొదటి నుంచి చెబుతూ నే ఉన్నారు. ఏ జిల్లాకై నా దామాషా కన్నా తక్కువ వస్తే ఆ కేడర్‌లో జూనియర్‌లకు పంపిస్తారని అంటున్నారు. కాగా, విభజన ప్రక్రియ ఆలస్యం, వివిధ సమస్యల పై పలువురు టీచర్లు కోర్టుకు వెల్లడంతో విభజనలో మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. సబ్జెక్ట్‌ కేడర్‌తో పాటు వయసు ఆధా రంగా సర్దుబాటు చేస్తారనే వాదన సైతం వినిపిస్తోంది. 35 ఏళ్లలోపు వారిని ఒక విభాగం, 35 నుంచి 50 ఏళ్ల లోపు రెండవ విభాగం, 50 నుంచి 62 ఏళ్ల వరకు మరో విభాగంగా విభజిస్తారని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో దివ్యాంగ ఉపాధ్యాయులు, స్పెషల్‌ కేటగిరీకి చెందిన టీచర్లను వేర్వేరుగా విభజిస్తారనే వాదన సైతం ఉంది. ఆ మేరకు ఆయా కేడర్‌లో వయసు ప్రాధా న్యం మేరకు విభజిస్తే సీనియర్‌లు సైతం అన్నమయ్య జిల్లాకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీచర్లలో టెన్షన్‌ ఏర్పడింది.

ఉద్యోగోన్నతులు

తీసుకుంటారా..?

విభజన ప్రక్రియలో భాగంగా బదిలీలు...ఉద్యోగోన్నతులు ఆగిపోయాయి. జీఓ ఇచ్చేవరకు ఉద్యోగోన్నతులు ఇచ్చుకోవచ్చని ఫ్రీజింగ్‌ను సవరించి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతులకు అవకాశం ఏర్పడింది. హెచ్‌ఎం పోస్టులకు స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్‌ఏ పోస్టుల కు ఎస్‌జీటీలను ఉద్యోగోన్నతిపై తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగోన్నతులు తీసుకుంటారా? అనే చర్చ సాగుతోంది. సాధారణంగా అనుకూలమైన ప్లేస్‌లు లేకపోతే ఉద్యోగోన్నతులు వద్దని టీచర్లు తిరస్కరిస్తారు. జిల్లా విభజన నేపథ్యంలో జూనియర్‌లుగా పరిగణిస్తారనే ఆందోళన సైతం ఉంది. దీంతో ఉద్యోగోన్నతులు తీసుకునేందుకు కొందరు టీచర్లు జంకుతున్నార ని తెలుస్తోంది.

జిల్లా సమాచారం

మొత్తం ప్రభుత్వ ప్రాథమిక బడులు 1,702

ప్రాథమికోన్నత పాఠశాలలు 40

హైస్కూళ్లు 305

ఉపాధ్యాయులు 16 వేలు

ఖాళీ పోస్టులు 902

తుది జాబితాలే సిద్ధం కాలేదు

ఇప్పటి వరకు సీనియారిటీ తుది జాబితాలే సిద్ధం కాలేదు. విభజన ప్రక్రియఆలస్యానికి కారణం ఇప్పటి వరకు తుది సీనియారిటీ జాబితాలు ప్రచురించకపోవడమే. విద్యాశాఖలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ. తుది సీనియారిటీ జాబితాలు స్పష్టం చేసిన తర్వాతే విభజన ప్రక్రియ చేపట్టాలి.

– రెడ్డి శేఖర్‌రెడ్డి,

వైఎస్సార్‌ టీచర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement