చిత్తూరులోని టీడీపీ నేతల అక్రమార్జనకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారు. ప్రధానంగా ఇసుక దందాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం ఖరీదైన కార్లను బహుమతిగా అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీ నాయకుడికి ఓ ఖాకీ అండగా నిలిచారు. స్వయంగా పర్యవేక్షిస్తూ టిప్పర్లను సరిహద్దులు దాటిస్తున్నారు. స్వామిభక్తిని ప్రదర్శించినందుకు రూ.18లక్షల విలువైన కారును నజరానాగా దక్కించుకున్నాడు. అయితే ఈ విషయం బయటపడడంతో చేసేదిలేక తీసుకున్న బహుమతిని అయిష్టంగానే తిరిగి ఇచ్చేశాడు. ఈ అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ విచారణను ఎదుర్కొంటున్నాడు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరులో ప్రస్తుతం కార్ల ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ అవగాహన, నియోజకర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఖాకీల గురించి తెలిసిన ఏ ఇద్దరు తారాస పడినా. కారుల గురించి కథ లు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట, ఈ నోటా పాకి చివరకు జిల్లా పోలీసు బాసు చెవిలో పడింది. దీనిపై సమగ్ర విచారణ పూర్తిచేసి, నివేదిక అందించాలని ప్రత్యేక విభాగం (ఎస్‌బీ)ను ఆదేశించినట్లు సమాచారం. ఇంతకూ ఆ కార్ల విష యం తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే...
చిత్తూరు నగర శివారు నుంచి తమిళనాడులోకి ప్రవేశించాలంటే 14 నిముషాల నుంచి 30 నిముషాల సమయం చాలు. తిరుత్తణి రోడ్డులో తంగాల్, పొన్నై, కాట్పాడి, వేలూరు, రాణిపేట లాంటి ప్రధాన పట్టణాలకు చిత్తూరు నుంచి చాలా తక్కువ సమయంలో చే రుకోవచ్చు. తమిళనాడులో ఇసుక రవాణా, నదుల నుంచి ఇసుక తీయడం నిషేదం. ఇసుకకు ప్రత్యామ్నాయంగా అక్కడ సిలికా, ఒక రకమైన నున్నటి పిండిని ఉపయోగిస్తారు. దీంతో తమిళనాడులో ఇసుకకు డి మాండ్ ఏర్పడడం జిల్లాలోని ఇసుకాసురులకు బాగా కలిసివచ్చింది.అందులోనూ గంగాధరనెల్లూరు,చిత్తూ రురూరల్, పూతలపట్టు ప్రాంతాల నుంచి రోజూ దాదాపు వందల కొద్దీ లారీల్లో ఇసుక తమిళనాడుకు స్మగ్లింగ్ అవుతోంది. ఇందులో అధికార పార్టీ నేతలు స్వయంగా రంగంలోకి రూ.కోట్లు కూడబెట్టుకుంటు న్నారు. కూటమి నేతలు మాత్రమే సంపాదన దిగమింగుతుంటే.. తామేమీ తక్కువ కాదంటూ కొందరు ఖాకీ లు ఇసుక ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారు.
జూద సామ్రాజ్యాధినేత కారు కథ..
చిత్తూరుకు చెందని ఓ టీడీపీ నేత తన జూద సామ్రాజ్యాన్ని తమిళనాడు సరిహద్దుల్లో విస్తరిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఓ సంచలనాత్మకమైన హత్య కేసులో సాక్షిగా ఉన్న ఈ ఘనుడు, తమిళనాడులోని పొన్నైలో జూదం నిర్వహిస్తూ.. రోజుకు రూ.60 లక్షల వరకు లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం తమిళనాడులోని కాట్పాడి సమీపంలో మేల్పాడి పోలీసులు జరిపిన దాడుల్లో ఈ టీడీపీ నేతకు చెందిన ఇన్నోవా కారును సీజ్ చేశారు. తమిళనాడు ఐజీ స్థాయి అధికారి దాడి చేసి పలువురిని అరెస్టు చేస్తే, ఈ సాక్షి మాత్రం తప్పించుకున్నాడు. కారు సీజ్ చేసి నెలల గడుస్తున్నా, స్టేషన్‌లో అది తుప్పు పడుతున్నా పట్టించుకోలేదు. ఈ జూద క్రీడలో వస్తున్న ఆదాయంతో వందల కార్లు కొనేంత ఆర్థికంగా ఎదిగిపోయాడన్నది టీడీపీలోని పలువురు సీనియర్లు బహరింగంగానే వ్యా ఖ్యానిస్తున్నారు. చిత్తూరులో దావానంలా వ్యాపించిన కార్ల కథ తెలిసిన వాళ్లు ముక్కున వేలేసుకోవడం తప్ప.. చేయగలిగింది ఏమీ లేదని నిట్టూరుస్తున్నారు.
చిత్తూరు సమీపంలో ఇసుక డంప్
తమిళ పోలీసులు సీజ్ చేసిన ఇన్నోవా కారు


