రూ.18 లక్షల కారు బహుమతి.. | - | Sakshi
Sakshi News home page

రూ.18 లక్షల కారు బహుమతి..

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

చిత్తూరు నుంచి తమిళనాడుకు వెళ్లే ఓ మార్గంలో గుడిపాలకు చెందిన అధికార పార్టీ నేత ఇసుక స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. రోజుకు దాదాపు రూ.2 లక్షలు కొల్లగొడుతున్న ఆయనపై సొంత పార్టీ నేతలే అధి ష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తమిళనాడుకు పంపుతున్న ఈ ఘనుడికి ఓ ఖాకీ అండగా నిలిచాడు. మూడు నెలలుగా కుప్పలు తెప్పలుగా ఇసుకను ఓ రహస్య ప్రదేశంలో డంప్‌ చేయడం, ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలించడమే పనిగా పెట్టు కున్నాడు. తనకు అండగా నిలబడ్డందుకు సదరు ఖాకీకి దాదాపు రూ.18 లక్షలు ఖరీదు చేసే టాటా నెక్సాన్‌ టాప్‌–ఎండ్‌ కారును బహుమతిగా ఇచ్చా డు. ఆ కారులో ఖాకీ రోజూ షికార్లు కొట్టడం, ఇసుక దందాను పట్టించుకోకుండా చూసీచూడనట్టు వదిలేసేవాడు. ఇటీవల రహస్య ప్రదేశంలో భారీగా నిల్వ ఉంచిన ఇసుక మేటల ఫొటోలు, లొకేషన్‌ను సంబంధిత పోలీసు అధికారికి ఓ నాయకుడు సమాచారం ఇచ్చారు. వెంటనే దాన్ని స్మగ్లర్‌కు చేరవేసిన ఖాకీ.. తన స్వామి భక్తిను చాటుకున్నాడు. విషయం పోలీ సు బాసుకు చేరడంతో.. ఆయన ఆదేశాలతో దీనిపై స్పెషల్‌బ్రాంచ్‌ విభాగం విచారణ చేపట్టింది. ఆ ఖాకీ కారు తీసుకున్న విషయం వాస్తవేమంటూ నిర్ధా రించింది. ఎస్‌బీ విభాగం తన గురించి కూపీ లాగుతున్నారని తెలుసుకున్న ఖాకీ వెంటనే కారును వెనక్కు ఇచ్చేశాడు. కానీ, ఇన్నాళ్లు ఆ కారులో ఎక్కడెక్కడ షికారు కొట్టాడు..? ఎలాంటి పనికిమాలిన పనులు చేశాడు..? అనే విషయాలను స్టేషన్‌ మొత్తం కోడై కూస్తోంది. మరి ఆ అవినీతి ఖాకీపై వేటు పడుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement