నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ పింఛన్ ఇవ్వడం లేదని చిత్తూరు రూరల్ మండలం పచ్చనపల్లెకు చెందిన బాధితుడు శరవణ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చూసుకునేందుకు ఎవరూ లేరని, అనారోగ్యంతో మంచానికే పరిమితమైనట్లు చెప్పాడు. పింఛన్ పొందేందుకు సదరం సర్టిఫికెట్‌లో అర్హత ఉందన్నారు. అయినప్పటికీ పింఛన్‌న్ అందడం లేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే అదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కన్మణి తనకు అందుతున్న రూ.4 వేలు పింఛన్ సరిపోవడం లేదని మొత్తం పెంచాలని కోరారు.


