చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో ప లు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు. రైళ్లు, బస్సుల్లో డ్రగ్స్ అక్రమ రవాణా ను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బస్సుల్లో ర్యాండమ్ చెకింగ్ నిర్వహించాలన్నారు. డ్రైవర్, కండక్టర్‌లకు అవగాహన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈగల్ టీమ్ ఈ మేరకు ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలోని పాఠశాలలు, జూనియ ర్, డిగ్రీ, మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన సదస్సు లు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూ లన చర్యల్లో ఎన్జీఓలను భాగస్వామ్యం చేస్తూ క్లస్టర్ స్థాయిలో ఆర్‌డీఓలు, డీఎస్పీలు పర్యవేక్షించాలని కోరారు. గంజాయి, ఇతర డ్రగ్స్ అక్ర మ రవాణా, విక్రయాల సమాచారం తెలి స్తే ప్రజలు 1972, 9490617896 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ వెల్లడించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
గుడిపాల: మండలంలోని గట్రాళ్లమిట్టకు చెందిన వీబీజీ రామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్ అక్ర మాలు బయట పడడంతో డ్వామా పీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. వివిధ పనులకు సంబంధించి బినామీ పేర్లతో పలు బిల్లులు స్వాహా చేయడంపై సాక్షి పత్రికలో ఆధారాలతో సహా వార్త ప్రచురితమైంది. దీనిపై ఎంపీడీఓ విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందించారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్‌న సస్పెన్షన్ చేస్తున్నట్లు డ్వామా పీడీ ఉత్తర్వులు జారీ చేశారు.


