తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి
చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రంలో మై భారత్ శాఖ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమా న్ని నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటి యువత భాష ను, సంస్కృతిని, సంప్రదాయాలను, సాహిత్యాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. మై భారత్ శాఖ జిల్లా యువజన అధికారి ప్రదీప్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు ఉంటుందన్నారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. పాల్గొన్న యువతకు కిట్స్ అందజేశారు. మై భారత్ శాఖ అకౌంట్ ఆఫీసర్ బాబురెడ్డి, విషయ నిపుణులు శ్రీనివాసులు నాయుడు, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.


