1100కు ఫిర్యాదు చేయండి
చిత్తూరు కార్పొరేషన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరంగా సమస్యలుంటే ఫిర్యాదు చేయా లని జిల్లా రిజిస్ట్రార్ ఏవీఆర్ మూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల ఫిర్యాదుల కోసం 1100 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగా తమ శాఖ పరంగా సమస్యలుంటే ఫోన్ చేసి తెలపాలన్నారు.
3న ‘షబేబరాత్’ పండుగ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఫిబ్రవరి 3వ తేదీన ముస్లింలు షబేబరాత్ పండుగ జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఖాజి అయి న సయ్యద్ మోహమ్మద్ కమాలుల్లా జహురి లతిఫ్ జునైది ఒక ప్రకటనలో తెలిపారు. షబేబరాత్ పండుగ సందర్భంగా ముస్లింలు తమ బంధువుల(పూర్వికులు) ఆత్మలకు (శాంతి) ప్రాప్తి పొందడానికి రాత్రి ప్రార్థనలు చేయాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.
హామీలు నెరవేర్చాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూట మి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన వేతన సవరణ అమలు చేస్తామని, ఎప్పటికప్పుడు కరువు భత్యం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హామీలను సత్వరం అమలు చేయాలనే డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రా ల అందజేత కార్యక్రమాలు నిర్వ హించనున్న ట్టు పేర్కొన్నారు.
మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
బంగారుపాళెం: చిరు వ్యాపారం సాగిస్తున్న మహిళకు లోన్ తీసిస్తామని నగదు అపహరించిన వ్యక్తి ని గురువారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని దిగువబందార్లపల్లెకు చెందిన దేవేంద్ర భార్య శారద మ్మ బంగారుపాళెంలోని ఓంశక్తి ఆలయం వద్ద కూరగాయల వ్యాపారం సాగిస్తోంది. ఈ నెల 22 వ తేదీన రాకేష్ అనే వ్యక్తి ఆమె వద్దకు వచ్చి లక్ష రూపాయలు లోన్ తీసి ఇస్తానని చెప్పి ఆమె వద్ద ఉన్న ఫోన్, పోన్‌పే స్కానర్ తీసుకుని అకౌంట్‌లో ఉన్న రూ.15 వేలను తీసుకువెళ్లాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఆర్ పురం మండలం, నూతిగుంటపల్లెకు చెంది న రాజేష్(27)ను తగ్గువారిపల్లెలో దండువామ్మె ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగుల ‘సెల్’గాటం!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో ఉద్యోగులకు విధులకంటే సెల్‌ఫోన్‌లే ముఖ్యమైపోయాయి. కలెక్టరేట్‌లోని పలు శాఖలతో పాటు మరి కొన్ని శాఖలలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఏ సిబ్బంది ఎప్పుడొస్తారో కూడా తెలియడం లేదు. కొందరు సమయానికి వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో సొంత పనులు చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్, అగ్నిమాపక శాఖ, ట్రెజరీ, కలెక్టరేట్, ఆడిట్ శాఖ, చిత్తూరు ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధి నిర్వహణల సమయంలో కొంత మంది సెల్‌ఫోన్‌లకు ప్రాధాన్యమిస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని పలువురు కోరుతున్నారు.
పింఛన్ల పంపిణీ రేపు
చిత్తూరు కలె క్టరేట్ : ఒకటో తేదీన నిర్వహించాల్సిన పింఛన్ల పంపిణీ ఈ నెల 31న చేపట్టనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫిబ్ర వరి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో జన వరి 31న పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు వారు వెల్లడించారు.
1100కు ఫిర్యాదు చేయండి


