శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుట్రలు పటాపంచలు
● సీబీఐ నివేదికపై సర్వత్రా హర్షం ● కపట కూటమికి కళ్లు తెరిపించావు గోవిందా! ● స్వార్థ రాజకీయాలకు దేవదేవుడినే వాడుకుంటారా? ● సీఎం, డెప్యూటీ సీఎంలు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● అలిపిరి పాదాల వద్ద పూజలు ● నేడు కూటమి అపచారానికి పరిహార హోమం
భక్తుల మనోభావాలతో ఆటలా?
తిరుమల శ్రీవారి లడ్డూ అంటేనే ప్రపంచంలోని హిందూవులకు పరమ ప విత్ర ప్రసాదం. అలాంటి ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారనే అవస్తవాన్ని ప్రచారం చేశారు. సీబీఐ నివేదికలో అలాంటిది ఏమీ లేదని, కల్తీ జరగలేదని తేలింది. గత ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నంలో శ్రీవారిని వినియోగించుకోవడం దారుణం. భక్తుల మనోభావాలతో పార్టీలు పబ్బం గడుపుకోవడం మానాలి.
– మధు స్వామి, అర్చకులు, వరదయ్యపాళెం
దారుణం
నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ జరిగిందని చంద్రబాబు సర్కార్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణం. సీబీఐ నివేదికలో కల్తీ జరగలేదని తేలింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. సున్నితమైన విషయాలను గందరగోళం సృష్టించే విధంగా ప్రచారం చేశారు.
– విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుట్రలు పటాపంచలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుట్రలు పటాపంచలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుట్రలు పటాపంచలు


