చిత్తూరు.. సాటిలేరు మాకెవరు! | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు.. సాటిలేరు మాకెవరు!

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

చిత్త

చిత్తూరు.. సాటిలేరు మాకెవరు!

అక్టోబర్‌లో సర్కిల్‌ ఏర్పాటు

పలు రంగాల్లో ప్రతిభ

అవార్డు కై వశం

చిత్తూరు కార్పొరేషన్‌: ఉత్తమ సేవలందించినందుకుగాను చిత్తూరు జిల్లాకు అవార్డు లభించింది. ట్రాన్స్‌కో డిస్కం పరిధిలో (తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు) వస్తాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు విభాగాలలో ప్రతిభ చూపినందుకు తిరుపతిలో సీఎండీ శివశంకర్‌ చేతుల మీదుగా చిత్తూరు ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు పలు విద్యుత్‌ అంతరాయాలు తక్కువ, కలెక్షన్లు పరంగా పుంగనూరు డివిజన్‌ నుంచి ఈఈ శ్రీనివాసమూర్తి అవార్డును స్వీకరించారు. సర్కిల్‌(జిల్లా) ఏర్పడిన 15 నెలల్లో అవార్డు రావడం సంతోషకరమని అధికారులు అంటున్నారు.

పలు రంగాల్లో ప్రతిభ

పలు రంగాలలో జిల్లాకు అవార్డులు లభించాయి. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు తక్కువగా వచ్చినందుకు.. కలెక్షన్స్‌ వసూళ్లు, తక్కువ బకాయిలు పరంగా చిత్తూరు రూరల్స్‌, పుంగనూరు డివిజన్లు, నగరి, పుంగనూరు సబ్‌డివిజన్‌, సెక్షన్ల పరంగా సంతపేట, ఐరాల, నగరి, పుంగనూరు ఈస్ట్‌లు నిలిచాయి. 11 కేవీ ఫీడర్ల పరంగా అంతరాయాలు పరంగా తక్కువగా చిత్తూరు అర్బన్‌, చిత్తూరు రూరల్స్‌, చిత్తూరు నగరం, జీడీనెల్లూరు సబ్‌డివిజన్లు, సెక్షన్లు పరంగా చిత్తూరు నగరంలోని మిట్టూరు, జీడీనెల్లూరులోని పాలసముద్రం ఉన్నాయి. ప్రమాదాలు తక్కువగా వచ్చిన ప్రాంతాల పరంగా చిత్తూరు అర్బన్‌ డివిజన్‌, చిత్తూర రూరల్స్‌ డివిజన్లు వచ్చాయి. ఎస్‌ఓపీ నిబంధనల అమలు చేసిన వాటిలో చిత్తూరు అర్బన్‌ డివిజన్‌, చిత్తూరు రూరల్స్‌ డివిజన్లు, సబ్‌డివిజన్‌ పరంగా పైపల్లె, నగరి, అరగొండలు వచ్చాయి. అదనపులోడ్‌ కేసులు నమోదులో పుంగనూరు 506 నమోదు చేసి రూ.34.11 లక్షలు, చిత్తూరు రూరల్‌లో 282 కేసులు నమోదు చేసి రూ.12.38 లక్షలు 9 నెలల కాలంలో వసూళ్లు చేశారు. మొత్తం 6 అంశాల పరంగా జిల్లా డిస్కంలో ప్రతిభ చూపారు.

అక్టోబర్‌లో సర్కిల్‌ ఏర్పాటు

ఉమ్మడి జిల్లా విద్యుత్‌శాఖ పరిపాలన గతంలో తిరుపతి కేంద్రంగా జరిగేది. పరిపాలన సౌలభ్యత కోసం అక్టోబరు 2024లో చిత్తూరులోని గిరింపేటలో సర్కిల్‌(జిల్లా) కార్యాలయం ఏర్పాటు చేశారు. మొదటి ఎస్‌ఈగా ఇస్మాయిల్‌అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా టెక్నికల్‌ ఈఈ, ఎస్‌ఎఓ, పీఓ, ఎంఆర్‌టీ, నిర్మాణ విభాగాలు ఏర్పడ్డాయి. ఎస్‌ఈ 1, ఈఈ 3, డీఈ 6, ఏఈ 12, జేఈ 4, ఎస్‌ఎఓ 1, ఏఏఓ 1, జేఏఓ 5, పీఓ 1, ఎస్‌ఎ 11, జేఏ 9 మంది చొప్పున మొత్తం 55 మందిని ఉద్యోగులను చిత్తూరుకు అడ్జస్ట్‌ చేశారు. ఇందులో ఇప్పటికి పలువురు ఉద్యోగులు ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఉన్న ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగింది.

డిస్కం పరిధిలో

మెరిసిన చిత్తూరు జిల్లా

ప్రత్యేక దృష్టి పెట్టాం

కొత్త సర్కిల్‌గా చిత్తూరు ఏర్పడింది. మొదట ఎస్‌ఈగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అంతా కొత్తగా ఉండేది. అధికారులు, ఉద్యోగుల సహకారంతో జిల్లా పై అవగాహన వచ్చింది. వసూళ్లు, అంతరాయాల పై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉద్యోగులతో అధికారికంగా కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించాను. పీఎం కుసుం పనులు జిల్లాలో ఆశించిన స్థాయిలో జరిగాయి. అలాగే ఎస్‌పీఎంలో నూతన ఓఆర్‌ఎం చిత్తూరులో రావడం ఉపయోగకరం. అందరి సహకారంతో అవార్డు వచ్చింది.

– ఇస్మాయిల్‌ అహ్మద్‌, ఎస్‌ఈ ట్రాన్స్‌కో

చిత్తూరు.. సాటిలేరు మాకెవరు! 1
1/1

చిత్తూరు.. సాటిలేరు మాకెవరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement