టీటీడీకి రూ.20 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ మాజీ సీవీఎస్వో దామోదర్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
పోలీసులపై
తెలుగు తమ్ముడి ఆగ్రహం
చంద్రగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లను నిలువరించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు తన నివాసంలోకి వెళ్లిన తర్వాత, ఓ కార్యకర్త ఆయన్ని కలిసేందుకు యత్నించారు. పోలీసులు అతన్ని నిలువరించడంతో ఒక్కసారిగా పోలీసులపై రెచ్చిపోయాడు. మా ప్రభుత్వంలో నన్నే అడ్డుకుంటారా..? మా నా యకుడికి చెప్పి నీ సంగతి తేలుస్తా అంటూ డీఎస్పీ స్థాయి అధికారిపై రెచ్చిపోయాడు. చేసే దేమి లేక అక్కడ ఉన్న సిబ్బంది ఆ కార్యకర్తను సముదాయించి పంపించడం గమనార్హం.
నేడు గోదాదేవి కల్యాణం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానంలో బుధవారం గోదాదేవి కల్యాణం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని పునీతులవ్వాలని కోరారు.
గుర్తుతెలియని మహిళ మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పీసీఆర్ కూడలిలో ఓ గుర్తుతెలి యని మహిళ మంగళవారం మృతి చెందింది. దాదాపు 50 ఏళ్ల వయస్సున్న మహిళ.. గత రెండు నెలలుగా ఇక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్ఫృహతప్పి ఉన్న మహి ళను స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, మహిళ ఆచూకీ తెలిస్తే ఫోన్–9440796707, 08575234100 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వన్‌టౌన్ పోలీసులు సూచించారు.
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
టీటీడీకి రూ.20 లక్షల విరాళం


