రైల్వే స్థలంలో రోడ్డు నిర్మాణం
– పట్టించుకోని అధికారులు
కుప్పంరూరల్: తన ప్రైవేట్ లే అవుట్ కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రైల్వే స్థలంలోనే రోడ్డు నిర్మించేశాడు. కుప్పం మండలం, గోపనపల్లి సమీపంలో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసి సైట్లు వేసుకుని, లే అవుట్ చేసుకున్నాడు. సంబంధిత లే అవుట్‌కు దారి లేకపోవడంతో ఏకంగా రైల్వే పట్టాలకు అనుకుని ఉన్న రైల్వే స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నాడు. పట్టాల వెంట సుమారు 50 మీటర్ల వరకు రోడ్డు కంకర వేసి చదును చేశాడు. ఈ రోడ్డును చూపించి వినియోగదారులకు సైట్లను విక్రయించాలని చూస్తున్నాడు. భవిష్యత్‌లో ఉన్న రైల్వే లైన్ పక్కనే మరో లైన్ వస్తుందని, రైల్వే అధికారులు పలుమార్లు సర్వేలు చేపట్టా రు. నూతన రైల్వే లైన్ వేస్తే లే అవుట్ దారికాస్త మూసుకుపోతుంది. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానిక రైల్వే అధికారులు తమ కేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు అయినా స్పందించి రోడ్డు నిర్మాణంపై చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రైల్వే స్థలంలో నిర్మించిన రోడ్డు


