చీకట్లో చేనేతలు
పుత్తూరులో పవర్‌లూమ్ యంత్రం
నేతపనుల్లో మహిళ
గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేకాకుండా విద్యుత్ చార్జీల నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబునాయుడు పుత్తూరులో పర్యటించారు. ఆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ చేనేత, పవర్‌లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాల పేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరిచారు.
చీకట్లో చేనేతలు


