పాపం భాను!
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా తయారైంది. నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతో పాటు మంత్రివర్గం సైతం ఆమోద ము ద్ర వేసింది. దీంతో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ధన్యవాదాలు సైతం చెప్పేశారు. జీఓ విడుదలై ఏడాది, ధన్యవాదాలు చెప్పి ఆరు నెలలు గడచిపోతున్నా జీఓ అమలు కావడం లేదు. దీనిపై అధినేతను అడగలేక.. అడుగుతు న్న వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అత్యధికంగా నేత కార్మికులు ఉన్న నగరి, పుత్తూరు పట్టణాల్లో అడుపెట్టాలంటేనే పాపం భానుకు వణికిపోతున్నట్టు టీడీపీ నాయకులే చెవులు కొరుక్కొంటున్నారు.


