ఆస్పత్రుల్లో అయోమయం!
– IIలో
న్యూస్‌రీల్
అన్నదాతలకు సేవలు దూరం
కంటికి కనిపించని సిబ్బంది
నిర్వీర్యం అవుతున్న ఆర్బీకేలు
అవస్థల్లో రైతన్నలు
వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్యసేవలు గాడితప్పుతున్నాయి. దీంతో పనిభారం పెరుగుతోంది.
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
పాలసముద్రం మండలంలో ఆర్బీకేను రేషన్ షాపుగా మార్చిన దృశ్యం
రైతు సేవలకు ఉరి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో ఏడాది కిందట 502 రైతు సేవా కేంద్రాలుండగా ప్రస్తుతం 314 కేంద్రాలకు కుదించారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు 113, ఎంపీఓలు 23, ఉద్యానశాఖ సిబ్బంది 93 మంది, పశుసంవర్థక సిబ్బంది 284 మంది సిరికల్చర్ సిబ్బంది 90 మంది పనిచేస్తున్నారు. ఈ రైతు సేవా కేంద్రాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. గత ఐదేళ్లు రైతులకు పలు సేవలు అందించాయి. అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాంటి సేవలను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేస్తోంది.
నేడు కోతలు
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాలపై కక్ష కట్టింది. 502గా ఉన్న కేంద్రాలను క్లస్టర్ పేరుతో 314కు తగ్గించింది. ఇక రైతు సేవలను నీరుగారుస్తోంది. ప్రధానంగా యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పొలం బడి దూరమైంది. పశు వైద్య శిబిరాలకు మంగళం పాడింది. మందుల కొరత వేధిస్తోంది. అప్పట్లో జనరల్ మందులు 50 రకాలు ఉండగా.. ఇప్పుడు ఆ మందులు శూన్యమవుతున్నాయి.
రైతు భరోసా కేంద్రాలకు
రైతు సేవా కేంద్రాలుగా రంగు
చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవలకు ఉరి వేస్తోంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి ఉన్న సేవల్లో కోతలు పెడుతోంది. డిజిటల్ కియోస్క్‌లు, టీవీలు మూలకు చేరాయి. మరోవైపు ఎరువులు, పురుగు మందులు అందించకుండా రైతులను కష్టాల్లోకి నెట్టింది. పశువైద్యాన్ని గాలికొదిలేసింది. సిబ్బందిని సర్వేలకు పరిమితం చేసింది. దీంతో రైతాంగం అవస్థలకు గురవుతోంది.
ఆస్పత్రుల్లో అయోమయం!
ఆస్పత్రుల్లో అయోమయం!
ఆస్పత్రుల్లో అయోమయం!


