విత్తనాలు నేటికీ పంపిణీ చేయలేదు
నగరి : నియోజకవర్గంలో 59 రైతు సేవా కేంద్రాలున్నాయి. విలీనం పేరుతో 28 రైతు సేవా కేంద్రాలను మరో కేంద్రాల్లోకి కలిపేశారు. ప్రస్తుతం కేవలం 31 కేంద్రాలే ఉన్నాయి. దీంతో రైతు సేవా కేంద్రాలు తొలగించిన గ్రామాల్లోని రైతులు సుదూరంగా ఉన్న పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత రబీలో సబ్సిడీపై అందించాల్సిన వేరుశనగ విత్తనాలను ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. నగరి మండలం ఓజీ కుప్పంలో రైతు సేవా కేంద్రం నిర్మాణం నిరుపయోగంగా ఉంది. విజయపురం మండలం కేవీపురంలో నిర్మాణం చేపట్టిన రైతుసేవా కేంద్రం పిల్లర్లకే పరిమితమయ్యాయి. ముడిపల్లి రైతుసేవా కేంద్రంలో ఎరువులు, యూరియా లేకపోవడంతో వారు తమిళనాడు సరిహద్దులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
విత్తనాలు నేటికీ పంపిణీ చేయలేదు


