కేంద్రాల కుదింపు.. సిబ్బంది రావడం గగనం
కాణిపాకం : పూతలపట్టు నియోజకవర్గంలో మొత్తంలో 96 రైతు భరోసా కేంద్రాలుండగా క్లస్టర్ పేరుతో 57 కేంద్రాలకు కుదించారు. యాదమరిలో 19 కేంద్రాలుండగా..పలు కేంద్రాలకు సిబ్బంది రావడం కష్టంగా మారింది. దీంతో రైతు సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. పూతలపట్టులో 16 కేంద్రాలుండగా ఆ సంఖ్యగా 8కి పడిపోయింది. మిగిలిన కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. ఉన్న కేంద్రాల్లో ఎరువులు దొరకడం కష్టంగా మారింది. బంగారుపాళ్యంలో 26 కేంద్రాలుండగా 13 కేంద్రాలు చేశారు. ఈ కేంద్రాల్లో రైతులు కావాల్సిన సేవలు దొరకడం లేదు. వీరంతా చిత్తూరు నగరానికి వస్తున్నారు. మిగిలిన వాటిని నిరుపయోగం చేశారు. తవణంపల్లిలో 17 ఆర్బీకేలను 7కు కుదించి..రైతులను అవస్థలోకి నెట్టేశారు. సిబ్బంది సర్వేలకు పరిమితమవుతున్నారు. ఐరాలలో 18 ఉండగా.. 10 కేంద్రాలకు పరిమితం చేశారు. ఈ కేంద్రాల్లో ఎరువులు, పశువైద్య సేవలు కనుమరుగువుతున్నాయి. యూరియా దొరక్క చిత్తూరు నగరంలోని ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.
సర్వే పేరుతో కేంద్రాలు ఖాళీ
చిత్తూరు నియోజకవర్గంలో 30 రైతు భరోసా కేంద్రాలుండగా..కూటమి ప్రభుత్వం 18 కేంద్రాలకు తగ్గించింది. చిత్తూరు అర్బన్ 4 కేంద్రాలు, రూరల్‌లో 9 ఉంటే 5 కేంద్రాల వరకు చేశారు. మండలంలో సేవలు అందని ద్రాక్షలా మారాయి. పశువైద్యం దైవాధీనంగా మారింది. యూరియా, పురుగు మందులకు తమిళనాడులోని పొన్నై, పరదారామికి వెళుతున్నారు. గుడిపాల మండలంలో 17 కేంద్రాలుంటే చివరకు 9 కేంద్రాలే మిగిలాయి. సిబ్బంది సర్వే పేరుతో వెళ్లిపోతున్నారు. క్లస్టర్‌లో కోతలు పడ్డ 8 కేంద్రాలకు తాళం పడగా భవనాల్లో కొన్నింటిని ఇతరత్రా వాటికి వాడేస్తున్నారు.
కేంద్రాల కుదింపు.. సిబ్బంది రావడం గగనం


