అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత
తవణంపల్లె : మండలంలోని గాజులపల్లె సమీపంలోని క్వారీ వద్ద దొరికిన నెమలిని స్థానికులు సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పగించారు. గాజులపల్లె సమీపంలోని క్వారీ వద్ద నెమలి రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టారు. క్వారీ వద్ద ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ డాక్టర్ నాయక్.. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు జబీ, మనోజ్‌లను పిలిపించి నెమలిని సురక్షితంగా అప్పగించారు. ఇటీవల అటవీ ప్రాంతాల్లో నివసించాల్సిన వన్యప్రాణులు పంట పొలాల్లోకి వస్తున్నా అటవీశాఖ అధికారులు వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


