మూత పడిన కేంద్రాలు
కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని రైతు సేవా కేంద్రాలను తెరవడం లేదు. గతంలో రైతులకు కావాల్సి విత్తనాలు, యూరియా, ఎరువులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు పంపిణీ నిలిపి వేశారు. ఇన్‌ఫుట్స్ సబ్సిడీ, బీమా, రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతు కేంద్రాలు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసి వెళ్తారు తప్ప నిత్యం రైతు భరోసా కేంద్రాలు తెరవడం లేదు. నియోజకవర్గంలోని 12 చోట్ల పంచాయతీ కార్యాలయాలను రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.


