గజరాజుల బీభత్సం
గుడిపాల : ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంట పొలాలపై పడింది. రైతులు సాగు చేసుకుంటున్న అరటి, మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. దీంతో పాటు పెన్సింగ్, పైపులన్నింటినీ ధ్వంసం చేశాయి. దీంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. బట్టువాళ్లూరు, ముత్తువాళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు హరినాథనాయుడు, మునిక్రిష్ణమనాయుడు, చందులతో పాటు మరికొంత మందికి సంబంధించిన 50 కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో పాటు అక్కడక్కడా మామిడి, అరటి చెట్లను విరగొట్టాయి. తమిళనాడు ప్రాంతం నుంచి 13 ఏనుగులు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏనుగులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో అని ఆదివారం సాయంత్రం డ్రోన్లను ఎగురవేసి దూర ప్రాంతాలకు తరిమిగొడతామని చెబుతున్నారు. ఇలానే కొనసాగితే తాము వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు తెలియజేశారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరణ్‌సింగ్ రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని నష్టపరిహారం అందజేస్తామన్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాల వైపు రాకుండా ట్రాకర్స్ సాయంతో ఏనుగులను తమిళనాడుకు తరలించే పనిలో ఉన్నామన్నారు.
గజరాజుల బీభత్సం


