బౌల్డిరింగ్ ఫెస్టివల్స్ రద్దు
కుప్పం: మండలంలోని కంగుంది గ్రామంలో ప్రభుత్వం నిర్వహించాల్సి ఉన్న బౌల్డిరింగ్ ఫెస్టివల్ రద్దయ్యింది. రాక్ క్లంబింగ్ క్రీడాకారులకు సరైనా వసతులు లేక పోవడంతో క్రీడాకారులు హాజరుకాలేదు. శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు జరగాల్సిన సాంస్కృతి కార్యక్రమాలకు మంత్రులు, శాప్ చైర్మన్, ఎమ్మెల్యేలు వస్తారని భావించిన స్థానిక అధికారులు, నేతలకు నిరాశే ఎదురైంది.
ప్లాన్ అదే..
కుప్పం ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బౌల్డిరింగ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు. పూణేకు చెందిన తదేకం, పర్యటక శాఖ, కుప్పం కడా సంస్థలు సంయుక్తంగా ఈ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్‌కు కుప్పం మండలం కంగుంది కోటను కేంద్రంగా ఎంపిక చేశారు. ప్రధానంగా రాక్ క్లంబింగ్ (గుట్టలు ఎక్కడం) క్రీడలకు పోటీలు నిర్వాహించారు. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున్న ఆర్భాటంగా నిర్వహించాలని ప్లాన్ వేశారు. దీని కోసం తదేకం సంస్థ ప్లాన్ ప్రకారం కడా, పర్యటక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాక్ క్లంబింగ్ క్రీడలతో పాటు స్థానికంగా ప్రాముఖ్యతను సంచరించుకున్న కంగుంది కళలు, వీధి నాటకాలు, వాటికి పర్యటకంగా చూపే ప్రయత్నం చేశారు.
వసతుల ఏర్పాటులో విఫలం
బౌల్డిరింగ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో చేపట్టే రాక్ క్లంబింగ్ క్రీడాకారులకు సరైన వసతులు లేవు. ముంబై, బెంగళూరుకు చెందిన 40 మంది క్రీడాకారులు కంగుంది గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. నాలురోజులు పాటు జరిగే ఈ ఫెస్టివల్ రాత్రి వేళలో సరైన వసతులు కల్పించలేదు. దీంతో పలువురు క్రీడాకారులు వెనుదిరిగారు. కంగంది అటవీ ప్రాతం కావడంతో కనీస వసతులతో పాటు రవాణా సౌకర్యలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల బయట ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
మంత్రుల పర్యటన రద్దు
బౌల్డిరింగ్ ఫెస్టివల్ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఆనం నారాయణరెడ్డి, రవాణ శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి శుక్రవారం రావాల్సి ఉండగా అకస్మాత్తుగా వారి పర్యటనలను రద్దు చేశారు. శనివారం పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజేతలకు బహుమతులు అందజేయాల్సి ఉంది. కానీ వారెవ్వరూ కుప్పం పర్యటనకు రాకపోవడంతో స్థానిక ఫెస్టివల్ నిర్వాహకులు అసహనానికి గురయ్యారు.
జనం లేక వెలవెలబోయిన ఫెస్టివల్
బౌల్డిరింగ్ ఫెస్టివల్స్‌లో నృత్యం చేస్తున్న విదేశీయులు
బౌల్డిరింగ్ ఫెస్టివల్స్ రద్దు


