బంధువు చావుకు వెళ్లి వస్తూ..
నగరి : బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నగరి మండలం, తడుకు పేట వద్ద చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జున రావు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం, రాణిపేట జిల్లా, పర్వత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు భరత్‌కుమార్ (25) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నారాయణవనంలో మృతిచెందిన తన బఽంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి పర్వత్తూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో తడుకుపేట వద్ద ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి ఢీ కొన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతుడు ఏకై క కుమారుడు. వివాహమై.. రెండేళ్ల పాప ఉంది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఇతను మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
యువకునికి తీవ్ర గాయాలు
నగరి : మున్సిపల్ పరిఽ ది, నగరిపేట సమీపం, జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరాజ్ (29) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడు పల్లిపట్టు తాలూకా, సొరకాయపేట గ్రామానికి చెందిన ఇతను పుత్తూరు వైపుగా వెళుతూ ముందుగా వెళుతున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి సైడ్ మిర్రర్ తగిలి కిందపడ్డా డు. జాతీయ రహదారి పక్కనే నిర్మించే కాలువకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
నలుగురికి జైలు
చిత్తూరు అర్బన్: వేర్వేరు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నలుగురు నిందితులకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ షేక్ బాబ్జాన్ శుక్రవారం తీర్పునిచ్చారు. నిందితులు ఎస్.మహేష్, ఆర్‌ఎస్.వసీం, ఆదినారాయణ, షణ్ముగం అనే నలుగురికి జైలుశిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉమాదేవి కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ, ఈశ్వరుని ఆల యం వీధిలో గత ఏడాది నవంబర్‌లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరుకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుల హాజరుపరచగా.. నేరం రుజువయ్యింది. మహేష్, వసీంకి మూడు నెలల జైలు శిక్ష, ఆదినారాయణ, షణ్ముగంకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
18 మద్యం బాటిళ్ల స్వాధీనం
కార్వేటినగరం: మండల పరిధిలోని డీఎం పురం గ్రామానికి చెందిన శ్రీధర్ ప్రొవిజన్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తేజ స్విని తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడు తూ నిత్యావసర సరుకుల దుకాణం ముసు గులో బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్టు తెలి పారు. ఆ దుకాణ యజమాని శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సిబ్బంది రాజశేఖర్, యుగంధర్, యువరాజ్ పాల్గొన్నారు.
బంధువు చావుకు వెళ్లి వస్తూ..
బంధువు చావుకు వెళ్లి వస్తూ..


