7.83 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ముఖ్యాంశాలివీ..
● వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి.
● ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు.
● గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శనాలు.
● పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు.
● భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 44 లక్షలు
కంటైనర్ ఢీకొని..
బంగారుపాళెం: మండలంలోని బలిజపల్లె ఫ్లైఓవర్‌పై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. పాలేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులుశెట్టి(55) పంబల కళాకారుడు. గాండ్లపల్లెలో ఓంశక్తి భక్తులు నిర్వహించే పూజా కార్యక్రమానికి పంబలు కొట్టేందుకు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం పాలేరు నుంచి గాండ్లపల్లెకు బయల్దేరాడు. మార్గ మద్యంలో బలిజపల్లె ఫ్లైఓవర్‌పై ఎదురుగా వస్తున్న కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


