భూమి ఇవ్వనందుకు కక్ష సాధింపు
అన్నదాత సుఖీభవలో మృతి చెందినట్లు రికార్డు తప్పుడు కేసులతో రిమాండుకు తరలింపు మూడు నెలలుగా రేషన్ నిలిపివేత బళ్ల గ్రామంలో రైతుల ఆవేదన
కుప్పం: సోలార్ ప్లాంట్‌కు భూమి ఇవ్వలేదని కూట మి ప్రభుత్వం కక్షగట్టింది. అధికారులతో దౌర్జన్యం చేయించింది. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించా రు. దీనిపై అధికారులు మరింత రెచ్చిపోయారు. దీనికి తోడు అధికార పార్టీ నేతలు రైతులను వేధి స్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు.. ఇదెక్కడో కా దండోయ్..రామకుప్పం మండలం, బళ్ల గ్రామంలో..
అసలేం జరిగిదంటే..?
సోలార్ ప్లాంట్‌కు ప్రభుత్వం భూములు సేకరించింది. బళ్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని 13 మంది రైతులకు చెందిన భూములు రెవెన్యూ అధికార్లు గుర్తించా రు. వీటిలో చిన్న కాలప్ప, శంకరప్ప వ్యవతిరేకించా రు. తమకు జీవానాధరంగా ఉన్న భూములు ఇవ్వ మని భీష్మించారు. కానీ అధికార్లు బలవంతంగా భూములు లాక్కొని సోలార్ ప్లాంట్ పనులకు శ్రీ కారం చుట్టారు. మరో పది మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి అటంకం ఏర్పాడింది.. దీన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.
అన్నదాత సుఖీభవలో
మృతి చెందినట్లు రికార్డు
రామకుప్పం మండలం, బళ్ల గ్రామానికి చెందిన చిన్న కాలప్పకు సర్వే నెం.158/2 ఏలో 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సోలార్ ప్లాంట్ ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీనికి ఆయన వ్యతిరేకించడంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో ఈ సారి చిన్నకాలప్పకు నగదు భ్యాంక్‌లో జమ కాలేదు. దీన్ని అన్‌లైన్ అప్‌డేట్ విచారించంగా చిన్న కాలప్ప మృతి చెందినట్లు రికార్డులు చూపుతున్నాయి. సోలార్ ప్లాంట్‌కు భూమి ఇవ్వనందకు రేషన్ కార్డుల్లో పేర్లు తోలగించారు. మూడు నెలలుగా రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకు నిలిపి వేశారు. ఆధార్ లింక్‌ను తొలగించి పెన్షన్ కూడా ఆపేశారు. అంతేకాకుండా తప్పుడు కేసులు బనాయించి 47 రోజులు రిమాండ్‌కు పంపారు. ఇలా రైతులపై కూటమి నేతలు కక్ష గట్టి వేధిస్తున్నారు.


