11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

11కేవ

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి

గుడిపాల: 11 కేవీ విద్యుత్‌లైన్‌ తగిలి ఓ టిప్పర్‌ షార్ట్‌ సర్క్యూట్‌కు గురైంది. ఈ ఘటనలో ఓ క్లీనర్‌ మృతిచెందాడు. గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌ కథనం.. గుడిపాల మండలం, ముత్తువాళ్లూరు గ్రామ సమీపంలో రోడ్డు వద్ద వర్షం కారణంగా గుంతలు ఏర్పడ్డాయి. వాటిని పూడ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఏపీ–39–టీఏ–7475 నంబరు గల టిప్పర్‌ మట్టిని తీసుకొచ్చి అన్‌లోడింగ్‌ చేస్తోంది. ఇంతలో పైన 11కేవీ విద్యుత్‌లైన్‌ తగలడంతో డ్రైవర్‌ అప్రమత్తమై కిందకు దూకేశాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్‌లోనే ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన క్లీనర్‌ పీతంబర్‌శెట్టి( 51) మృతిచెందాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపుచేశారు. టిప్పర్‌ వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో దివ్యాంగ క్రీడాకారులకు ఉచితంగా క్రీడాసామగ్రి పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపారు. వైకల్యాన్ని అదిగమించి విజయాలు సాధించాలన్నారు. ఎలాంటి బాధ లేకుండా కృషి, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం దివ్యాంగ క్రీడాకారులకు క్రీడీ సామగ్రిని ఉచితంగా అందజేశారు. డీఎస్‌డీవో ఉదయ్‌భాస్కర్‌, దివ్యాంగ క్రీడాకారులు జ్యోతి పాల్గొన్నారు.

108 డ్రైవర్‌ గుండె పోటుతో మృతి

కాణిపాకం: ఆపదలో అందరి ప్రాణాలను కాపాడే 108 డ్రైవర్‌ గుండె పోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. ఐరాల మండలం, దేవగిరి గ్రామానికి చెందిన హేమశేఖర్‌ నాయుడు(42) కాణిపాకం 108 డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కాణిపాకం నుంచి ఓ కేసును తీసుకొని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. తిరిగి కాణిపాకం వెళ్తున్న సమయంలో నగరంలోని దర్గా సర్కిల్‌ వద్ద ఓ షాపు వద్ద ఆగి ఏవో వస్తువు కొంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. అదే 108లోనే మరో డ్రైవర్‌ అతన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ లోపు 108 సిబ్బంది సీపీఆర్‌ కూడా చేస్తూ వెళ్లారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే హేమశేఖరనాయుడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.

కొత్తపల్లిమిట్టలో ఐసీఎంఆర్‌ బృందం పర్యటన

శ్రీరంగరాజపురం : మండలంలోని 49 కొత్తపల్లిమిట్టలో నాలుగురికి స్కృబ్‌ టైఫస్‌ వ్యాధి సోకడంతో జాతీయ ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ బృందం పర్యటించింది. రీసెర్చ్‌ సభ్యులు సురేష్‌, విష్ణునాథన్‌, ఎల్‌.అరసన్‌ రోగులను పరామర్శించారు. వారికి ఉచితంగా మందులను అందించారు. అనంతరం 49 కొత్తపల్లిమిట్ట గ్రామస్తులకు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. గ్రామంలోని 25 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, ల్యాబ్‌కు పంపారు. ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్‌ బాలజీచరణ్‌, సుపర్‌వైజర్‌ ఝాన్సీరాణి పాల్గొన్నారు.

యూరియాపై ఆందోళన వద్దు

పెనుమూరు(కార్వేటినగరం): జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఐ.మురళి చెప్పారు. బుధవారం పెనుమూరు మండలం, గుంటిపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయడం వల్ల మిగిలిన రైతులకు సకాలంలో అందించ లేకపోతున్నామన్నారు. అలాగే సమగ్ర పోషణ, యాజమాన్య పద్ధతులను వివరించారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ద్రవ రూపంలో ఒక్కసారి పిచికారీ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమా, డీఆర్సీ లక్ష్మీప్రసన్న, ఏఓ సుహర్‌లత పాల్గొన్నారు.

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి 
1
1/3

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి 
2
2/3

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి 
3
3/3

11కేవీ విద్యుత్‌ లైన్‌ తగిలి క్లీనర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement