మిగిలిన పీజీ సీట్ల భర్తీకి కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో యాజమాన్య కోటాలో పీజీ సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కన్వీనర్ కోటాలో మిగిలిన పీజీ సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నామన్నారు. పీజీలో మిగిలిన రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, ఆంగ్లం సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9182320973, 9849313989 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు.
నేడు విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి బుధవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గాంధీరోడ్డులో ఉన్న అర్బన్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
10న వాహనాల వేలం
పుంగనూరు: మద్యం అక్రమ రవాణాలో సీజ్ చేసిన వాహనాలను పట్టణంలోని తమ కార్యాలయంలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల వారు నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.
‘ఎస్‌డీహెచ్‌ఆర్’లో
310 మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ : స్థానిక ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ, పీజీ విద్యా సంస్థలో మంగళవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 310మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఎమ్‌ఎన్‌సీ కంపెనీ ప్రతినిధులు చేపట్టిన ఇంటర్వ్యూల్లో రూ.6.2లక్షల ప్యాకేజీతో తమ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై నిపుణులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
మహిళా చట్టాలపై
అవగాహన అవసరం
చౌడేపల్లె: మహిళల రక్షణ కోసం అమలయ్యే చట్టాలపై గ్రామీణ మహిళలకు అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబరు డాక్టర్ రుఖియాభేగం సూచించారు. మంగళవారం ఆమె తొలుత బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదైన మైనర్ బాలికల అదృశ్యంపై అందిన ఫిర్యాదులపై ఆరా తీశారు. నూనెముద్దనపల్లె గ్రామానికి చెందిన పోక్సో కేసు బాధితురాలితో మాట్లాడారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని ఆమె భరోసా కల్పించారు. బూరగపల్లె, దుర్గసముద్రంలో మైనర్ బాలికల మిస్సింగ్ కేసుల విషయమై ఆరా తీశారు. రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఆమినిగుంట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని, కుల్లిపోయిన కోడి గుడ్లు ఇస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సేవలు అందించడంలో ఐసీడీఎస్ సిబ్బంది విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరగపల్లె అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అలాగే ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో బ్యాడ్‌టచ్, గుడ్‌టచ్ తోపాటు సమస్యలు వచ్చినప్పుడు మనోధైర్యం తో ముందుకెళ్లాలని సూచించారు. ఆమె వెంట ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, విశ్రాంత ఎస్పీ పీసీ స్వామి, సీఐ రాంభూపాల్, తహసీల్దార్ పార్వతి, సీడీపీఓ రాజేశ్వరి, ఎంపీడీఓ లీలామాధవి, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, మణికంఠేశ్వరరెడ్డి, సూపర్‌వైజర్లు రాధ, సులోచన పాల్గొన్నారు.
మిగిలిన పీజీ సీట్ల భర్తీకి కసరత్తు


