కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రజలకు కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార, అనుబంధ ఆరోగ్య సేవల ఉప కమిషనర్ డాక్టర్ జోయాఅలీరిజ్వీ నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన బృందం కలెక్టర్‌ను కలిసి సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్య సేవలు అందించే లక్ష్యంతో కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా టాటా డిజిటల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వైద్య ఆరోగ్యశాఖ సేవలను కమిటీకి వివరించారు.
ప్రతి కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి
జిల్లాలోని ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 411 గిరిజన కుటుంబాలకు నూతన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీపం 2 పథకంలో ఎల్‌పీజీ కనెక్షన్లు పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న గిరిజన కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో ఎవ్వరూ గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉండకూడదని తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఎస్టీ కాలనీలను సందర్శించాలన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉందా...లేదా అని రీ వెరిఫికేషన్ చేయాలన్నారు.


