ప్రజలకు మెరుగైన సేవలందించాలి
గుడిపాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సెంట్రల్ అనేమియా ముక్తభరత్ డెప్యూటీ కమిషనర్ జోయా ఆలీ రిజ్వి తెలిపారు. మంగళవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి వైద్యసేవలందిస్తున్నారు, గర్భిణులను గుర్తించి ఆన్‌లైన్ నమోదు చేస్తున్నారా, ఎటువంటి పరీక్షలు చేస్తున్నారు.. తదితరాలపై ఆరాతీశారు. టీబీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు..? వారికి చికిత్సలు ఎక్కడ చేస్తున్నారు అని టీబీ అధికారిని అడగ్గా ఉచితంగా చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో చికిత్సలు చేయిస్తున్నట్టు తెలిపారు. ఆశావర్కర్లు తమకు ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం సెల్‌ఫోన్‌లు అందజేసిందని, ప్రస్తుతం ఏ ఒక్కటీ పనిచేయడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వసంతాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సెంట్రల్ టీం సభ్యులు అర్పిత, హరిక్రిష్ణన్, స్టేట్ ఇమ్యూనిజేషన్ ఆఫీసర్ దేవి, హెచ్‌డబ్ల్యూసీ ప్రోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం, ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సతీష్, స్టేట్ ఫ్యామిలీ ప్లానింగ్ అధికారి నిర్మలాగ్లోరితో పాటు గుడిపాల వైద్యాధికారులు సంధ్య, చంద్రమహేష్ పాల్గొన్నారు.
వసంతాపురం ఆయుష్మాన్ ఆరోగ్య
మందిర్‌లో కేంద్ర వైద్య బృందం
గుడిపాల: ఆశావర్కర్లతో మాట్లాడుతున్న జోయా ఆలీ రిజ్వి
ప్రజలకు మెరుగైన సేవలందించాలి


