అసలేం జరిగిందంటే..!
చిత్తూరు కలెక్టరేట్ : అసలు సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏం జరుగుతోంది. అక్కడే ఎందుకు వరుసగా విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడు తున్నారు.. కళాశాల నిర్వాహకులు ఏం చేస్తున్న ట్టు..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఈనెల 31న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మరువక ముందే మంగళవారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.
వారంలోపే రెండో ఘటన
సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 31న తృతీయ సంవత్సరం చదివే నందిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన చోటు చేసుకుని వారం తిరగక ముందే తాజాగా రుద్రమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల నిర్వాహకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ వరుస ఘటన లు చోటు చేసుకుంటున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించారు.
ఇదేంది పోలీసన్నో?
చెట్టంత బిడ్డను కోల్పోయిన బాధలో రుద్రమూర్తి తల్లి తులసి, కుటుంబీకులు కళాశాల వద్దకు వెళ్లి నిర్వాహకులు, ప్రిన్సిపల్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తాలూకా సీఐ నిత్యబాబు అక్కడ విధుల్లో ఉన్నారు. లోనికి వెళ్లిన విద్యార్థి కుటుంబీకులు తమ గోడును చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థి కుటుంబంలోని ఓ మహిళను సీఐ నిత్యబాబు బలవంతంగా ఐదు మెట్లు కిందకు తోసివేశారు. మహిళ కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెకు నీళ్లు తాగించి ప్రథమ చికిత్స చేయడంతో తేరుకుంది.
సమగ్ర విచారణ చేపట్టాలి
సీతమ్స్ కళాశాలలో జరుగుతున్న వరుస ఆత్మహత్య ఘటనలపై సమగ్ర విచారణ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన పై పలువురు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. కాగా సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ సీతమ్స్ కళాశాలలో వరుస ఆత్మహత్య ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారం రోజుల్లో రెండు ఆత్మహత్యాయత్నాలు జరిగాయంటే నిర్వాహకులు ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి, కూటమి ప్రభుత్వం ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకుని కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేయాలంటూ పోలీసులతో మాట్లాడుతున్న విద్యార్థి కుటుంబీకులు
మహిళను పట్టుకుని నెట్టేస్తున్న తాలూకా సీఐ నిత్యబాబు
సీతమ్స్‌లో ఏం జరుగుతోంది?


