– సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
కుప్పం: స్వయం సహాయ సంఘ మహిళలకు బ్యాంకు అందిస్తున్న రుణాలు సద్వినియోగం చే సుకుని, మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సూచించారు. కుప్పంలో గురువారం బీఆర్‌డీఏ, మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలకు సేవలు అందించడానికి ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో మైక్రోసెట్ శాఖను ఆమె ప్రారంభించారు. అనంతరం కృష్ణదాసనపల్లి, గుడ్లనాయనిపల్లి గ్రామాల్లో మహిళలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందు లో భాగంగా బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాల ను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో నడవాలని కోరారు. కుప్పం క్లస్టర్ పరిధిలో 160 సంఘాలకు రూ.30 కోట్లు ఇండియన్ బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జోన్ ద్వారా మహిళా సంఘాలకు 330 కోట్లు ఇండియన్ బ్యాంకు ద్వారా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వేసవి శిబిరంలో భాగంగా జాబ్ ఓరియెంటెడ్ కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ప్రిన్సిపాల్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. 45 రోజుల కాలవ్యవధితో కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్), 2 నెలల కాలవ్యవధితో సీ, సీ++, ఆటోక్యాడ్, 3 నెలల కాలవ్యవధితో హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, మల్టీమీడియా, 6 నెలల కాలవ్యవధితో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ అడ్వాన్స్‌డ్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ కోర్సుల్లో తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఆయా కోర్సులకు కనీస విద్యార్హత 7వ తరగతి అని, వివరాలకు 99851 29995, 76718 87039 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


